Wednesday, September 14, 2011

........Ramayanam....

 ఏంటో తెలియదు ఈ మధ్య రాముడి మీద భక్తి ఎక్కువైపోతోంది.కారణం చెప్పాలంటే...... రామాయణం చదివాను..వాల్మీకి రామాయణం...అద్భుతం... 


    8 అడుగుల పొడవుతో సుకుమారమైన బలమైన దేహదారుడ్యంతో చూడగానే సమ్మోహనాస్త్రానికి మనల్ని బలి చేసే రాముడు దేవుడు కాదు(మనిషి కాబట్టి) కానీ దేవుడే...ఎందుకంటే రాజు ఎంతమంది నైనా పెళ్లి చేసుకోవచ్చు అనే  రోజుల్లో ఒకే భార్య అని అంత నిష్టగా ఉండటం మాటలు కాదు(దశరథుడికి ౩౦౦౦ మంది భార్యలు..ముగ్గురు అర్ధ పత్నులు ..రాజపత్నులు కూడా ..)..దేవేంద్రుడిని కూడా పరుగులు పెట్టించిన రావణాసురుణ్ణి చంపడం మాటలు కాదు...జనస్థానంలో చిత్రకూటం లో రాముడు ఒక్కడే (లక్ష్మణుడిని సీతాదేవికి కాపలాగా ఉంచి)  14000  మంది రాక్షసులని మట్టిలో కలిపేశాడు....అందుల్లో రావణుడికి సేనాధిపతులతో సమానమైనటువంటి ఖరదూషణులు కూడా ఉన్నారు..అది మానవ సాధ్యమైన విషయం కాదు....చపలచిత్తులైనటువంటి వానరుల సాయంతో వారధి నిర్మించాడు...వానరులతో స్నేహం...మామూలుగా  ఐతే ఇది సాధ్యపడే విషయం కాదు..( హనుమ వల్ల సగం పని జరిగింది ఇక్కడ)...ఇక రావణసోదరుడైన కుంభకర్ణుని చూసి కళ్ళు తిరగకుండా ఉండటమే పెద్ద గొప్ప...వాడిని ,రావణుడిని హతమార్చి రాముడు లోకానికి దేవుడయ్యాడు.....అద్భుతమైన కోసల రాజ్యానికి మరుసటి రోజు అభిషిక్తుడిని చేస్తానని మాట ఇచ్చి అలా చెయ్యాల్సిన రోజు(రాజ్యం సంగతి దేవుడెరుగు) ..14 సంవత్సరాలు  అడవులు పట్టి తిరగమని  తండ్రి చెప్పలేక చెప్పలేక (కైక కిచ్చిన మాటకు కట్టుబడి) చెప్తే ముఖంలో కించిత్ బాధ బెంగ లేకుండా చిరునవ్వుతో  అడవికి పయనమైన రాముడు దేవుడు కాక మరేమవుతాడు( డబ్బు,పదవి  పిచ్చితో కొట్టుకునే ఈ లోకానికి)...?
               లంకలో రావణుడిని గెలిచినా తర్వాత లోకం  సీతమ్మ మీద అపవాదు వెయ్యకూడదని అగ్ని ప్రవేశం చేయించాడు...వెనక్కి వచ్చాడు ...రాజ్యాన్ని క్షేమంగా సుఖంగా ఉండేలా  పరిపాలించాడు...

            కానీ ఇంత సుగుణాభిరాముడు,దయాగుణంలో వేరెవరు సాటి లేని రాముడు సీతాదేవి ఒక ఆడది అన్న విషయం కూడా పక్కన పెట్టి ఒక్కదాన్నీ అడవుల్లో వదిలి రమ్మనడం ఎందుకో యెంత ఆలోచించిన నాకు అర్ధం కాలేదు..సరే ఒకవేళ నిజంగా తనకు ఆమె మీద అంత కోపమే వస్తే జనకుడు ఉన్నాడు కదా...పుట్టింటికి     పంపించేయచ్చు కదా...అడవుల్లో ఎందుకు వదలడం??ఎంత ఆలోచించినా నాకు అర్ధం కాలేదు.....
          ఇంత అద్భుతమైన మహాకావ్యం ఒక విషాదాంతంగా మిగలడం కొంచెం బాధ కలిగించింది...సుఖాంతం అయ్యుంటే యెంత బాగుండేదో కదా.......
                                                         జై శ్రీరామ్ ......